ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు. ప్రస్తుతం ఆమె మూడు రోజుల డెహ్రాడూన్ పర్యటనలో ఉన్నారు. బర్త్‌డే సందర్భంగా ఆమె డెహ్రాడూన్‌లోని జాతీయ దృష్టి దివ్యాంగజన సాధికారత సంస్థ విద్యార్థులతో కొంత సమయం గడిపారు. దివ్యాంగ విద్యార్థులతో సంభాషించారు. పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులు, అతిథులను పలకరించారు. అధ్యక్షురాలు ముర్ము పుట్టినరోజు సందర్భంగా.. ఈ సంస్థ విద్యార్థులు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అంధ విద్యార్థుల ప్రదర్శనను చూసిన ముర్ము భావోద్వేగానికి గురయ్యారు.
Viral Video: ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లలో వినూత్నత, హాస్యాస్పద ఘటనలు, భావోద్వేగ సందర్భాలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి అనేది ఇరు కుటుంబాలకే కాకూండా, వారి బంధుమిత్రులందరికి ఎంతో ఆనందాన్నిచ్చే ఘట్టం. అయితే కొన్నిసార్లు ఈ వేడుకలు అనూహ్యంగా మారి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా, ఓ పెళ్లి స్టేజ్‌పై జరిగిన ఓ ముద్దుల సన్నివేశం సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను కట్టిపడేస్తోంది. Read Also: IND vs ENG: ఇంగ్లాండ్‌కు చేరిన భారత మహిళల…
Viral Video: ఈమధ్య కాలంలో విమానాల్లో ప్రయాణికుల అసభ్య ప్రవర్తన, ఇంకా రకరకాలకు సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తరచూ వైరల్ అవుతున్నాయి. విమానంలో ప్రయాణిస్తున్న కొంతమంది తగిన నియమ నిబంధనలను పాటించకపోవడం, ఇతర ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేయడం, అంతేకాకుండా సిబ్బందిని నిర్లక్ష్యంగా పరిగణించడం వంటి ఉదంతాలు తరచూ చూస్తున్నాం. తాజాగా, ఇలాంటి మరొక వీడియో వైరల్ అవుతూ తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. Read Also: Anaya Bangar: “నేను మహిళల క్రికెట్‌కి అర్హురాలిని” ట్రాన్స్ ఉమెన్…
ప్రస్తుతం కాలంలో ఎక్కువ రోజులు బతకడం కష్టం. ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా చాలా మంది 60-70 మధ్యలోనే మరణిస్తున్నారు. మరి కొందరు రోగాలు, ప్రమాదాలు సంభవించి మధ్యలోనే మృత్యుఒడికి చేరుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా వృద్ధ తల్లి, కుమార్తెల అసమాన ప్రేమకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఈ మధ్యకాలంలో ప్రభుత్వ శాఖల సోషల్ మీడియా అకౌంట్లను నడిపే వాళ్లు కూడా ట్రెండింగ్ అంశాలతోనే తాము చెప్పాలనుకున్న విషయాన్ని జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయంలో ముందు వరుసలో నిలుస్తుంది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సోషల్ మీడియా హ్యాండిల్. ఎన్నోసార్లు సినిమా హీరోల వీడియోలతో ట్రాఫిక్ అవేర్నెస్ పెంచే ప్రయత్నం చేస్తూ ఉండే సదరు హ్యాండిల్ తాజాగా కట్ చేసి రిలీజ్ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ మధ్యనే ప్రభాస్…
Wicket Keeper Catch: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ అంటే కేవలం బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు.. ఫీల్డింగ్ కూడా ఎంతో కీలకం. ఫీల్డింగ్ లో ఒక్క తప్పిదం మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తుంది. అయితే, ఈ క్రమంలో కొన్నిసార్లు ఆటగాళ్ల నుంచి అనుకోకుండా నవ్వులు పుట్టించే ఘట్టాలు కూడా చోటుచేసుకుంటాయి. అలాంటి ఒక సరదా సంఘటన తాజాగా కేరళ ప్రీమియర్ లీగ్ (Kerala Premier League)లో జరిగింది.…
Viral Video: నేటి సమాజంలో పెళ్లి అంటేంటే యువత అయ్యబాబోయ్.. మాకు వద్దు అనే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే, పెళ్లైన కొద్ది రోజులకే విడాకులు, పగలు, హత్యలు ఇలా ప్రతిరోజు ఏదో ఒక దారుణం గురించి చూస్తూనే ఉన్నాము. పెళ్లి తంతు జరిగి వారం రోజులు కూడా గడవక ముందే భార్యభర్తల మధ్య అనుమానాలు చెలరేగి, ఘర్షణలకు దారి తీస్తున్న ఉదంతాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ప్రేమ, నమ్మకం, బాధ్యత అనే విలువలు మరిచిపోతున్న ఈ కాలంలో వివాహ…
Grand Welcome : ఇంటికి కొత్త అతిథి రాక అనేది ఎంతటి ఆనందాన్ని తెస్తుందో అందరికీ తెలుసు. ముఖ్యంగా ఒక ఆడపిల్ల ఆరోగ్యంగా జన్మించినప్పుడు, ఆ ఆనందం రెట్టింపు అవుతుంది. ఒక కుటుంబంలో దాదాపు 56 సంవత్సరాల తర్వాత ఆడపిల్ల జన్మించినప్పుడు, ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దే లేదు. ఈ కథ ఒక అలాంటి అద్భుతమైన సంఘటన గురించి.. వారు ఆ చిన్నారిని మొదటి సారి ఇంట్లోకి ఆహ్వానించిన తీరు అందర్ని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో…
సమంత ముంబైలో తన జిమ్ బయట జరిగిన ఒక ఘటనలో పాపరాజీ(ఫోటో, వీడియో గ్రాఫర్)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంగళవారం ఉదయం, సమంత ముంబైలోని తన జిమ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో పాపరాజీ ఫోటోగ్రాఫర్లు ఆమెను చుట్టుముట్టి ఫోటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించారు. బ్రౌన్ కలర్ స్పోర్ట్స్ వేర్లో ఉన్న సమంత, ఫోన్లో మాట్లాడుతూ బయటకు వచ్చారు. Also Read:Se*xual Assault: జైలు…
Red Bull Ultimate Cricket Challenge: ఇంగ్లాండ్ తో జూన్ 20 నుండి జరగబోతున్న 5 టెస్టుల సిరీస్ లో భాగంగా టీమిండియా ఇంగ్లాండ్ లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా.. భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం అతను టీమ్ ఇండియాలో భాగంగా సిద్ధమవుతున్నాడు. అయితే టెస్ట్ సిరీస్‌కి ముందు రాహుల్ ఒక విభిన్నమైన క్రికెట్ అనుభవాన్ని పంచుకుంటూ కనిపించాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్…