టాలీవుడ్ లో హీరోయిన్‌గా ‘కమిటీ కుర్రాళ్ళు’, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ లాంటి సినిమాల్లో నటించిన టీనా శ్రావ్య వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణలో ఆదివాసీలు సహా అందరూ పవిత్రంగా భావించే సమ్మక్క సారలమ్మ జాతర త్వరలో జరగనుంది. ఆసియాలోని అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరున్న ఈ దేవాలయానికి ఇప్పటి నుంచే జనాలు వెళుతున్నారు. అయితే, భక్తులు సమ్మక్క సారలమ్మ దేవతలకు బంగారంగా భావిస్తూ బెల్లాన్ని సమర్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా తమ బరువుకు తగ్గ బెల్లాన్ని సమర్పించడం…