ఓ చిన్నారి తాను చదువుతోన్న ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాల లేమిని ఏకంగా ప్రధాని మోదీకి తెలియజేయాలనుకుంది. తాను చదువుతున్న స్కూల్లో మౌలిక వసతులు సరిగా లేకపోవడంతో ఆవేదన చెందిన చిన్నారి.. ‘మా స్కూల్ ఎంత చెత్తగా ఉందో చూడండి’ అని చూపిస్తూ వీడియోలో ప్రధాని మోదీ సాయం కోరింది.