ఈ రోజుల్లో ఎవరికి వారే యమునా తీరే. ఎవరి దారి వారిది. ఉరుకుల పరుగుల జీవితం. అందునా నగర జీవనంలో పక్కవారి గురించి ఆలోచించే తీరిక, ఓపిక వుండదు. అసలే ఎండాకాలం. సూరీడు చుర్రుమంటున్నాడు. మామలుగా నడిచే వెళ్ళే వ్యక్తులు వడదెబ్బకు గురవుతున్నారు. రోడ్డపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి హఠాత్తుగా కింద పడిపోయాడు. నగరంలో ఇది కామనే అనుకుని చాలామంది అతడి మానాన అతడిని వదిలేశారు. అతను అలాగే వుండిపోయాడు. కానీ కొందరు అలా కాదు. పక్కన…