బొబ్బిలి వీణ తయారీదారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత హామీ ఇచ్చారు. వీణ తయారీకి 30 ఏళ్లు పెరిగిన పనస చెట్టు కలప మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని, రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో పనస చెట్ల పెంపకానికి యాక్షన్ ప్లాన్ రూపొందించామన్నారు. బొబ్బిలి చేనేత చీరల అమ్మకాలు పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. హస్తకళాకారులను సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా లేపాక్షి షో రూమ్‌లు…