ఆ రెండు పార్టీలు మిత్రపక్షాలైనా.. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాల్లో కలిసి సాగడం లేదు. నేతలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. కిందిస్థాయిలో రెండు పార్టీల వర్గాలకు పొసగడం లేదట. ఏంటా పక్షాలు..? ఏపీ రాజకీయాల్లో చర్చగా మారిన మిత్రపక్షాలేంటి? నేతలు కలిసి మాట్లాడుతున్నా.. వేర్వేరుగా పోరాటాలు! 2019 ఎన్నికల ఫలితాల తరువాత ఏపీలో రాజకీయాలు చాలా మారిపోయాయి. బీజేపీపై కాలుదువ్వి.. వామపక్షాలతో నడిచిన జనసేన తర్వాత కమలదళంతో జట్టుకట్టింది. 2024లో డిల్లీలో మోడీ.. ఏపీలో మా జోడీ…