ఫేవరేట్ హీరోలు డబుల్ రోల్‌లో నటిస్తే ఫ్యాన్స్‌కు ఇక డబుల్ ట్రీటే.. సీనియర్ హీరోల నుంచి మొదలు.. నేటీ జూనియర్ ఎన్టీఆర్ నుంచి రామ్ చరణ్ వరకు ఎంతో మంది స్టార్స్ డ్యూయల్ రోల్ పోషించి ఎంటర్టైన్ చేశారు. బ్రదర్స్ లేదా ఫాదర్ అండ్ సన్ రిలేషన్ లో హీరోస్ డ్యూయల్ రోల్ చేసి అదరగొడుతున్నారు. కానీ కోలీవుడ్ మాత్రం దీనికి భిన్నంగా ఉంది. కొత్త ఈక్వేషన్ స్టార్ట్ చేసింది. హీరోలే డ్యూయల్ చేయాలా.. విలన్స్ చేయకూడదా…