వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం లో కోతుల బెడద విపరీతంగా పెరిగిపోయింది. వేలాది కోతులు గ్రామ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. ఇళ్లలోకి చొరబడి రక్కి గాయపరుస్తున్నాయి.. ఒంటరిగా తిరగలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువేత్తాయి. కోతుల నుండి మా ప్రాణాలు కాపాడండి మొర్రో అని వేడుకుంటున్నారు.. వానరసేనల దాడుల నుండి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ఇల్లంద గ్రామ సర్పంచ్ కు ఇంతకు మించిన మార్గం కనిపించలేదు..…