సీఎం జగన్‌ను అసభ్యపదజాలంతో దూషించిన కేసులో టీడీపీ నేత పట్టాభిరామ్‌కు విజయవాడ 3వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గురువారం మధ్యాహ్నం పట్టాభిని పోలీసులు కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి నవంబర్ 2 వరకు రిమాండ్ విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. ఈ సందర్భంగా పట్టాభి తన వాదనలను న్యాయమూర్తికి వినిపించారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదని… ప్రభుత్వంలో ఉన్న లోపాలనే ప్రస్తావించానని తెలిపారు. తన ఇంటిపై వైసీపీ కార్యకర్తలు అనేకసార్లు దాడి చేశారని…