Vijayawada Metro Rail: విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్ట్ టెండర్ల గడువును పొడిగించింది ఆంధ్రప్రదేశ్ మెట్రోరైల్ కార్పొరేషన్.. మెట్రో రైల్ ప్రాజెక్టు టెండర్ల గడవు నేటితో ముగుస్తున్న నేపథ్యంలో.. మరో 10 రోజులు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.. దీంతో.. ఈ నెల 24వ తేదీ వరకు టెండర్లు దాఖలు చేసుకునే అవకాశం కల్పించింది ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్.. దీంతో, టెండర్లు వేసేందుకు సిద్ధమవుతున్న కంపెనీలకు కాస్త ఉపశమనం లభించినట్టు అయ్యింది.. ఇక, విజయవాడ మెట్రో టెండర్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి…