ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత బోండా ఉమ విరుచుకుపడ్డారు. విజయవాడ అత్యాచార బాధితురాలికి అండగా నిలవడమే తాము చేసిన తప్పా అని బోండా ఉమ ప్రశ్నించారు. తాము బాధితురాలిని కలవడానికి వెళ్తున్నామని తెలిసే.. వాసిరెడ్డి పద్మ అక్కడికి చేరుకుని ఓవరాక్షన్ చేశారని మండిపడ్డారు. ఘటన జరిగిన మూడు రోజుల ఆమె బాధితురాలిని కలిసి రాజకీయానికి తెరతీశారని ఆరోపించారు. బాధితురాలి కుటుంబాన్ని రోడ్డుకు లాగిందే వాసిరెడ్డి పద్మ అని తీవ్ర విమర్శలు చేశారు.…