2026 సంక్రాంతి శోభతో గోదావరి జిల్లాలు కళకళలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి జిల్లా వ్యాప్తంగా భోగి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. పల్లె వాతావరణంలో రంగు ముగ్గులు, గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలు, కోలాటాల మధ్య భోగి వేడుకలు సంబరాన్ని తాకుతున్నాయి. పండుగ వేడుకల్లో పాలుపంచుకునేందుకు ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కుటుంబ సభ్యుల మధ్య పండుగ వేడుకలను గోదావరి జిల్లా వాసులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. విజయవాడలో భోగి పండుగ సంబరాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఒక పల్లె వాతావరణాన్ని తలపించేలా…