టీడీపీకి గతంలో కంచుకోటగా ఉన్న ఉమ్మడి విజయనగరం జిల్లా.. ప్రస్తుతం మంచుకోటగా మారి.. క్రమంగా పార్టీ ఉనికి కోల్పోతున్న దుస్థితి నెలకొంది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలను గంపగుత్తగా వైసీపీ కైవశం చేసుకున్నప్పుడే ఈ విషయం తేటతెల్లమైంది. అప్పటితో పని అయిపోయిందని అనుకున్నారో.. పార్టీకి ఊపిరి లూదడం తమకు సంబంధం లేదని భావించారో ఏమో ప్రస్తుతం నాయకులతోపాటు పార్టీ కూడా పొలిటికల్ తెరపై నుంచి కననుమరుగయ్యే ప్రమాదం దాపురించింది. మరో రెండేళ్లలో అసెంబ్లీ…
వారసులను జనాల్లోకి వదిలేందుకు విజయనగరం జిల్లాలోని సీనియర్ పొలిటీషియన్స్ వేయని ఎత్తుగడ లేదు. మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఇలా పలువురు ప్రజాప్రతినిధులు.. తమ ఇంటి నుంచే భవిష్యత్‌లోనూ పొలిటికల్ యాక్టివిటీస్ కొనసాగాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో వారు చేపడుతున్న పనులు.. రచిస్తున్న వ్యూహాలు ఆసక్తిగా ఉంటున్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్.. డాక్టర్. సందీప్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బొత్స పెద్ద…