Rachakonda Police: తెలుగు రాష్ట్రాల్లో దసరా పెద్ద పండుగ. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇక దసరా పండుగ సందర్భంగా ఉపాధి కోసం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారుకూడా వారి స్వస్థలాలకు బయలు దేరుతున్నారు.
Attack on Hindu Temple in bangladesh: బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువులు, హిందూ ఆలయాలపై దాడులు ఆగడం లేదు. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ మతఛాందసవాదులు తరుచుగా హిందువులు, హిందూ ఆలయాలపై దాడులు చేస్తున్నారు. ప్రధాని షేక్ హసీనా మైనారిటీల రక్షణకు కట్టుబడి ఉంటామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం వేరేలా ఉంటున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ లో అత్యంత పురాతనమైన హిందూ ఆలయంపై దాడి చేశారు దుండగులు. దేవీ దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు.
8 Dead, Several Missing During Idol Immersion: విజయదశమి పండగపూట విషాదం నెలకొంది. దుర్గా మాత విగ్రహ నిమజ్జనం కోసం వెళ్లి భక్తులు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ విషాదకర ఘటనలో ఇప్పటి వరకు 8 మంది మరణించగా.. మరికొంత మంది గల్లంతు అయినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని జల్పాయిగురి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జల్పాయిగురి జిల్లా మల్బజార్ ప్రాంతంలో బుధవారం రాత్రి 9 గంటలకు ఈ ఘటన జరిగింది.