ప్రముఖ టాలీవుడ్ విలన్ విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ మృతి చెందారు. సోమవారం ఉదయం చెన్నైలో ఓ ప్రవేట్ హాస్పిటల్‌లో గుండెపోటుతో మరణించారు. వారం క్రితం హైదరాబాద్‌లో ఒక సినిమా షూటింగ్‌లో గాయపడ్డ విజయ రంగ రాజు.. ట్రీట్‌మెంట్ కోసం చెన్నై వెళ్లి అక్కడే కన్నుమూశారు. విజయ రంగరాజుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. టాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Also Read: Dwaraka Tirumala Rao: పోలీసులు సంక్షేమం కోసమే…