తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటికీ చెక్కుచెదరని క్లాసిక్‌గా నిలిచిన చిత్రం ‘మాయాబజార్’. 1957 మార్చి 27న ఆంధ్ర దేశంలో విడుదలై సంచలన విజయం సాధించిన ఈ చిత్రం, నేటికీ 68 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి. రంగారావు, సావిత్రి, రేలంగి, గుమ్మడి, ముక్కామల, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, ఆర్. నాగేశ్వర రావు, సూర్యకాంతం, రమణా రెడ్డి వంటి దిగ్గజ నటులు ఈ పౌరాణిక చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. Also Read:Lawyer:…
తెలుగు చిత్రసీమలో మరపురాని, మరచిపోలేని చిత్రాలను అందించిన సంస్థగా ‘విజయా ప్రొడక్షన్స్’ నిలచిపోయింది. ఆ సంస్థ రథసారథులు బి.నాగిరెడ్డి – చక్రపాణి కూడా జనం మదిలో అలాగే సుస్థిర స్థానం సంపాదించారు. ఒకే ఆత్మ రెండు శరీరాలుగా నాగిరెడ్డి, చక్రపాణి మసలుకున్నారు. భావితరాలకు ఆదర్శంగా నిలిచారు. చక్రపాణిది ఆలోచన అయితే, దానిని ఆచరించడంలో నాగిరెడ్డి మేటిగా నిలిచేవారు. స్నేహబంధానికి మారుపేరుగా నిలచిన వీరిద్దరిలో నాగిరెడ్డి మిత్రుడు కన్నుమూశాక, సినిమాలు నిర్మించడం మానేశారు. విలువలకు పట్టం కడుతూ చిత్రాలను…