సుమ కనకాల ప్రధాన పాత్రలో విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. ఈ నెల 22న రావాల్సిన ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. మే 6న మూవీని రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. రేపు ఈ సినిమా ట్రైలర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉదయం 11.07 నిమిషాలకు ఆవిష్కరించబోతున్నాడు. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ఈ విలేజ్ డ్రామా టీజర్, పాటలతో చాలా ఆసక్తిని రేకెత్తించింది.…
ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జయమ్మ పంచాయితీ. ఈ చిత్రంతో సుమ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా పోస్టర్స్, మొదటి సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండవ లిరికల్ సాంగ్ ని దర్శకధీరుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసి చిత్ర బృందానికి…