డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మరోసారి అత్యధిక వ్యూయర్ షిప్ నమోదైంది. మొన్న పాకిస్తాన్- ఇండియా మ్యాచ్ లో అత్యధికంగా 3.5 కోట్ల మంది వీక్షించగా, తాజాగా జరిగే న్యూజిలాండ్ మ్యాచ్ లో 4 కోట్లు వ్యూయర్ షిప్ దాటింది.
ఇండియా-పాక్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ హాట్ స్టార్ లో అత్యధికంగా చూశారు. దాదాపు 3.5 కోట్లకు పైగా మంది చూశారు. ఇంతకుముందు కూడా భారత్-పాక్ మ్యాచ్ తలపడినప్పుడు 3 కోట్ల మంది చూశారు. తాజాగా ఆ రికార్డును ఇప్పుడు చెరిపేసింది. మూడు కోట్లకు పైగా మంది హాట్ స్టార్ మ్యాచ్ లైవ్ చూస్తుండటం.. ఇది డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రికార్డుగా చెబుతున్నారు.