CP Radhakrishnan: ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత ప్రమాణస్వీకారం చేయించనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్టప్రతి భవన్‌లో ఉదయం 10 గంటలకు జరగనున్న కార్యక్రమంలో రాధాకృష్ణన్ తదుపరి ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారని వారు తెలిపారు.