గత 44 ఏళ్ళుగా బీజేపీ పని చేస్తోందని, 45వ పుట్టిన రోజు జరుపుకుంటోంది బీజేపీ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణ రాజు వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. జనసంఘ్‌ను శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రారంభించారని తెలిపారు. ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే.. జనసంఘ్ రద్దు చేసి.. జనతా పార్టీని ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు. 1980 ఏప్రిల్ 6 న జనతావపార్టీ నుంచీ బయటకి వచ్చి స్వతంత్రంగా బిజెపి ఏర్పడిందని, బీజేపీ మిగిలిన పార్టీలతో…