(మార్చి 6న నటి కృష్ణకుమారి జయంతి)తెలుగు చిత్రసీమలో పలువురు అక్కాచెల్లెళ్ళు నటీమణులుగా అలరించారు. అయితే వారిలో అక్కను మించిన చెల్లెలుగా పేరొందిన నటి ఎవరంటే ముందుగా కృష్ణకుమారి పేరే వినిపిస్తుంది. తన అక్క షావుకారు జానకి చిత్రసీమలో అడుగు పెట్టిన వెంటనే తానూ కెమెరా ముందుకు వచ్చారు కృష్ణకుమారి. నాటి మేటి హీరోల సరసన నాయికగా నటించి, అరుదైన విజయాలను సొంతం చేసుకున్నారామె. టాప్ స్టార్స్ తోనే కాదు అప్ కమింగ్ హీరోల సరసన కూడా హీరోయిన్…