(జూన్ 1 డా. ప్రభాకర్ రెడ్డి జయంతి సందర్భంగా)చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానంటారు. కానీ ప్రభాకర్ రెడ్డి మాత్రం డాక్టర్ అయిన తర్వాతే యాక్టర్ అయ్యారు. అప్పటి నల్గొండ జిల్లా సూర్యాపేట తుంగతుర్తిలో 1935 జూన్ 1న జన్మించిన ప్రభాకర్ రెడ్డికి నటన, రచన అనేవి యుక్తవయసు నుండి అబ్బిన విద్యలు. దానికి తోడు చదువులోనూ మొదటి నుండి ప్రథమ స్ధానంలో ఉన్న ఆయన ఎం.బి.బి.ఎస్. చదివారు. ఓ వైపు వైద్య విద్యను అభ్యసిస్తూనే, అంతర్…