‘జగమే మాయ’తో చిత్రసీమలో ప్రవేశించిన మురళీ మోహన్ ఈ మాయా జగతిలోనూ అందరివాడు అనిపించుకున్నారు. నొప్పించక తానొవ్వక అన్నట్టుగా మురళీమోహన్ తీరు ఉంటుంది. అందరినీ నవ్వుతూ పలకరించడం, తనను ఆశ్రయించిన వారికి సాయం చేయడం, సినిమా రంగంలో ఏదైనా కార్యక్రమ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించడం వంటివి ఆయన వ్యాపకాలు. ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’కు అధ్యక్షునిగా ఉన్న సమయంలో తనదైన బాణీ పలికించటమే కాదు ‘జయభేరీ’ అధినేతగా మరపురాని చిత్రాలను అందించారు. ఇక రియల్ ఎస్టేట్ లోనూ…