దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నా, తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇవ్వడంతో తిరిగి సాధారణ జీవనం ప్రారంభమైంది. రెండు వేవ్‌ల నుంచి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొన్నప్పటికీ ప్రజల్లో ఏలాంటి మార్పు రాలేదు. మాస్క్ లేకుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. దీంతో మళ్లీ దేశంలో కరోనా విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 41 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. జూన్ నెల నుంచి కేసులు తగ్గడంతో ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గింది. కాగా, ఇప్పుడు మరలా…