హర్యానాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగు చూసింది. అచేతన స్థితిలో చికిత్స పొందుతున్న ఓ మహిళా రోగిపై ఆస్పత్రి సిబ్బంది అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. ఐసీయూలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘోరం గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటుచేసుకుంది.
Sritej Father Bhaskar : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ క్రమంగా కోలుకుంటున్నాడు. రోజుకు రోజుకు అతని ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. కిమ్స్ వైద్యులు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్లు విడుదల చేస్తున్నారు. ఈ మధ్య, శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడారు. నిన్నమొన్నటి నుంచి…
సంగారెడ్డి జిల్లా కంది మండలం ఐఐటీ హైదరాబాద్ లో మెడికల్ ఎక్విప్ మెంట్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్. ఈ కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ మూర్తి, జిల్లా కలెక్టర్,ఎస్పీ పాల్గొన్నారు. ఐఐటి హైదరాబాద్ లో జీవన్ లైట్ స్మార్ట్ మెడికల్ ఐసీయూ వెంటిలేటర్ ను ప్రారంభించారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఐఐటి హైదరాబాద్ లో తయారు చేసిన జీవన్ లైట్ స్మార్ట్ మెడికల్ ఐసియు వెంటిలేటర్ ప్రారంభించడం సంతోషంగా ఉంది.…