రాజధానిలో పేదలకు ఇళ్లిచ్చే అద్భుతమైన కార్యక్రమం దేశ చరిత్రలోనే ప్రత్యేకమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. దేశంలో పేదలకు ఇల్లు కావాలని అనేక పోరాటాలు చూశామన్నారు. కానీ పేదలకు ఇల్లు ఇవ్వడానికి సుదీర్ఘ న్యాయ పోరాటం చేయాల్సి వచ్చిందని.. యాభై వేల మందికి ఇల్లు ఇస్తామంటే మారీచులు ,రాక్షసులు లాంటి ప్రతిపక్షాలు అడ్డు పడ్డాయని ఆయన మండిపడ్డారు.