ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో భాగంగా ఉండవల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో సీఎం ఓటు వేశారు. సీఎంతో పాటు మంత్రి నారా లోకేశ్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల స్థానానికి నేడు పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉండవల్లి యూపీ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్దకు చంద్రబాబు, లోకేశ్ చేరుకుని ఓటు వేశారు. కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ స్థానంలో 25 మంది అభ్యర్థులు…
మన తరుపున పోరాడుతూ.. మన కష్టాలపై మాట్లాడే వ్యక్తికి ఓటు వేయండని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కోరారు. పట్టభద్రులందరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఈ ఎన్నిక ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం అని, చైతన్య వంతులైన విద్యావంతులు పనిచేసే వారికి మద్దతుగా నిలవాలన్నారు. పట్టభద్రులందరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి.. తమలోని చైతన్యాన్ని చూపాలని ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు. గుడివాడ ఎస్పీఎస్ మున్సిపల్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలోఎమ్మెల్యే రాము…