రాజకీయాలలో నల్లపురెడ్ల కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్టీఆర్ కేబినెట్‌లో నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి నెంబర్-2గా కొనసాగారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రసన్నకుమార్‌రెడ్డి కోవూరు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యే. 2009లో టీడీపీ నుంచి గెలిచిన ప్రసన్నకుమార్‌రెడ్డి అనూహ్యంగా వైఎస్‌ఆర్ వైపు చేరారు. వైఎస్ హఠాన్మరణంతో జగన్‌కు మద్దతుగా నిలిచారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు కూడా. 2012లో జరిగిన కోవూరు ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గెలిచారు ప్రసన్నకుమార్‌రెడ్డి. నాడు వైసీపీ తరఫున వైఎస్ విజయమ్మ తర్వాత…
సుప్రీం కోర్టు బెంచ్ పెడితే భూమి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైసీపీ ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల వేతనాలు పెంచడానికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. సుప్రీం కోర్టు రీజినల్ బెంచ్‌లు ఏర్పాటు చేయాలని, ఆర్టికల్ 130 ప్రకారం రాష్ట్రపతి ఆమోదంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేయొచ్చని సూచించారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో కేవలం నలుగురు (9 శాతం),…