దారుణహత్యకు గురైన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి అంత్యక్రియలలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామానికి మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. వీరయ్య చౌదరికి నివాళులర్పించి.. ఆయన కుటుంబసభ్యులను సీఎం పరామర్శించనున్నారు. వీరయ్య చౌదరి అంత్యక్రియలకు పలువురు టీడీపీ ముఖ్య నేతలు కూడా హాజరుకానున్నారు. టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి దారుణ హత్య ఒంగోలులో కలకలం రేపింది. మంగళవారం రాత్రి 7.30 గంటల…