Veera Raghava Reddy : గతంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి చేసి సంచలనం సృష్టించిన కొవ్వూరి వీర రాఘవరెడ్డి తాజాగా మరోసారి దాడికి గురయ్యాడు. గురువారం (మే 1, 2025) కండిషన్ బెయిల్‌పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వస్తుండగా దాదాపు 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్‌లో సంతకం చేసి తిరిగి వస్తున్న వీర రాఘవరెడ్డి…
చిలుకూరు బాలాజీ ప్రధాన పూజారి రంగరాజన్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డికి రాజేంద్రనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 15 వేలు రెండు పూచ్చీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. అసలు ఏం జరిగిందంటే.. గత ఫిబ్రవరి ఈ నెల 7న 20 మంది నిందితులు (మహిళలు, పురుషులు) సీఎస్ రంగరాజన్ ఇంటికి వెళ్లారు. రామదండు కోసం మనుషులను రిక్రూట్ చేయాలని, అలానే ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. రంగరాజన్ అందుకు వ్యతిరేకించినందుకు…
Veera Raghava Reddy: రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి పోలీసుల విచారణలో కీలక విషయాలను వెల్లడించాడు. మూడు రోజులుగా కొనసాగుతున్న విచారణలో ఆయన తన చర్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. రంగరాజన్‌పై దాడి చేయడం తప్పే అని అంగీకరించిన వీర రాఘవరెడ్డి, ఆ సంఘటనకు కారణాలను వివరించాడు. పోలీసుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. వీర రాఘవరెడ్డి తన చర్యను సమర్థించుకోలేనని, ఇకపై శాంతియుతంగా రామరాజ్య స్థాపన కోసం పనిచేస్తానని చెప్పాడు. తన వెంట…
Chilukuru: చిలుకూరు ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్‌పై దాడి చేసిన రామరాజ్యం వీర రాఘవరెడ్డి ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు మూడురోజులపాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ రోజు నుంచి మూడు రోజులపాటు పోలీసులు వీర రాఘవరెడ్డిని విచారించనున్నారు. పోలీసుల రిమాండ్ రిపోర్టులో వీర రాఘవరెడ్డి సంబంధించిన అనేక కీలక అంశాలు వెలుగుచూశాయి. తాను శివుడి అవతారం అని ప్రకటించుకుని, “రామరాజ్యం” పేరిట రిక్రూట్మెంట్ ప్రారంభించినట్టు పోలీసులు గుర్తించారు. Read Also: Fake IT Jobs: ఫేక్…
రామరాజ్యం వీర రాఘవరెడ్డి కేసులో సంచలన అంశాలు వెలుగు చూశాయి. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ఉన్నట్లు తేలింది. తనకు తాను శివుడి అవతారం అని క్రియేట్ చేసుకున్నాడు వీర రాఘవరెడ్డి. శివుడి అవతారం ధరించాను అంటూ రామరాజ్యంలో రిక్రూట్మెంట్ కూడా చేశాడు.