సుమన్ తేజ్, అను శ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “వశిష్ఠ” పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. నోరి నాగప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాను మైథలాజికల్ సోషల్ డ్రామా కథతో దర్శకుడు హరీశ్ చావా రూపొందిస్తున్నారు. తెలుగు టెలివిజన్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ నాగబాల సురేష్ కుమార్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, నిర్మాత లయన్ సాయివెంకట్ స్క్రిప్ట్ అందజేశారు.…