యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం Krishna Vrinda Vihari అనే రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఐరా క్రియేషన్స్ నిర్మిస్తుండగా, ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. అందులో నాగ శౌర్య, షిర్లీ సెటియా మధ్య ఉన్న ఆకర్షణీయమైన కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంటోంది.…