Vijay - Ajith : కోలీవుడ్ స్టార్ హీరోలు దళపతి విజయ్, అజిత్ లు తొమ్మిదేళ్ల తర్వాత సంక్రాంతి బరిలో దిగుతున్నారు. మరి ఈ పోరులో ప్రేక్షకులు, వారి అభిమానులు తమ హీరో సినిమాలను ఏ స్థాయికి తీసుకెళ్తారో చూడాలి.
దళపతి విజయ్ ఫాన్స్ కి, తల అజిత్ ఫాన్స్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత రైవల్రీ ఉంది. అజిత్, విజయ్ ఫ్యాన్స్ ‘ఫాన్ వార్’ అనే పదానికే నిలువెత్తు నిదర్శనంలా ఉంటారు. టాపిక్ తో సంబంధం లేకుండా, ఎలాంటి విశేషం లేకుండా ట్విట్టర్ లో ట్రెండ్ చెయ్యడం ఈ ఇద్దరు హీరోల అభిమానులకి బాగా అలవాటైన పని. 1996 నుంచి మొదలైన ఈ ఫ్యాన్ వార్ లో తిట్టుకోవడమే కాదు కొట్టుకోవడం కూడా జరుగుతుంది.…