'పిఠాపురం నుంచి నాకు తల్లిలాంటిది.. నా అక్క గీతమ్మ నిలబడుతోంది.. పిఠాపురంలోని ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయాలి.. లోకల్ హీరో కావాలా? లేకపోతే సినిమా హీరో కావాల్నా ఆలోచన చేసుకోవాలన్నారు సీఎం వైఎస్ జగన్
Vanga Geetha on Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు అని పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత అన్నారు. పిఠాపురంను అప్రతిష్ట పాలు చేసే విధంగా పవన్ మాట్లాడవద్దన్నారు. పిఠాపురం నియోజకవర్గానికి 25 ఏళ్లుగా తానేం చేశానో ప్రజలకు తెలుసని వంగా గీత పేర్కొన్నారు. 2024 శాసనసభ ఎన్నికలలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, వంగా గీతలు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. దాంతో ఎన్నికల వేళ పిఠాపురంలో రాజకీయాలు…
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌తో పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు భేటీ అయ్యారు. పిఠాపురంలో వంగ గీత గెలుపు కోసం కృషి చేయాలని దొరబాబును ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. అంగీకరించిన దొరబాబు...పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని జగన్‌కు చెప్పారని తెలిసింది.
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతివిమర్శలకు దిగుతున్నారు. ఇటీవల తనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కాకినాడ ఎంపీ, వైఎస్సార్‌సీపీ పిఠాపురం అభ్యర్థి వంగా గీత కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఉదయం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె.. ఎన్టీవీతో మాట్లాడారు.