తమిళ కథానాయకుడు సూర్య, బాలా కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ‘నంద’. ఆ సినిమా నటుడిగా సూర్యకు చక్కని పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో ‘పితామగన్’ సినిమా రూపుదిద్దుకుంది. ఇది తెలుగులో ‘శివపుత్రుడు’గా డబ్ అయ్యింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు బాలా పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు మూవీ పేరు ఖరారు చేశారు. తమిళంలో ‘వనన్ గాన్’ అనే పెట్టగా, తెలుగులో…