ప్రతిష్టాత్మక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మూడో తరం ఇప్పుడు చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఏడిద నాగేశ్వరరావు మనవరాలు, నటుడు శ్రీరామ్ కుమార్తె శ్రీజ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ పేరుతో ఓ సినిమాను నిర్మిస్తోంది. ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంచ్ చేసి…