కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మొదటిసారిగా స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు. ఇప్పటివరకు ఆయన నటించిన అనేక సినిమాలు తెలుగులో డబ్ అయిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ ఇప్పుడు నేరుగా తెలుగులోనే ఓ సినిమా చేయబోతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘తలపతి 67’ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించనున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరించాలని నిర్మాణ సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది వేసవిలో ‘తలపతి 67’ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.
దళపతి విజయ్, ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తెలుగులో విజయ్ కు ఇదే మొదటి స్ట్రయిట్ చిత్రం. ఇటీవలే వంశీ పైడిపల్లి తన స్టోరీని విజయ్ కు వివరించి, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి వంశీ స్క్రిప్ట్ రాస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం విజయ్ కోసం వంశీ ఎమోషనల్ యాక్షన్ డ్రామాను రాస్తున్నట్లుగా తెలుస్తోంది. కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయట. ఈ…