గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు కోర్టులో భారీ ఉపశమనం లభించింది.. ఏలూరు జిల్లాలోని నూజివీడు కోర్టు తాజా వల్లభనేని వంశీకి బెయిల్ ఇచ్చింది.. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరు చేసింది నూజివీడు కోర్టు.. అయితే, లక్ష రూపాయలకు సంబంధించి 2 ష్యూరిటీలు, వారానికి 2 సార్లు స్టేషన్ కి రావాలంటూ షరతులు పెట్టింది..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు.. ఇప్పటికే ఐదు కేసులో వల్లభనేని వంశీ మోహన్‌కు.. బెయిల్, ముందస్తు బెయిల్‌లు ఉండగా.. ఇప్పుడు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనూ వంశీకి బెయిల్ వచ్చేసింది.. అయితే, ఈ కేసులో బెయిల్ వచ్చినా.. వేరే కేసులో రిమాండ్ విధించడంతో.. వల్లభనేని వంశీ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది..