Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. రెండో రోజు వైకుంఠ ద్వార దర్శనాల్లో భాగంగా మొత్తం 70,256 మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని పరవశించారు. దర్శనంతో పాటు తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. రెండో రోజున 25,102 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అదే…
Vaikunta Dwara Darshan: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై నిర్వహించిన మంత్రుల సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో హోంమంత్రి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షించినట్టు మంత్రులు వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి వంటి అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు…