Vaibhav Suryavanshi Record for India: చెన్నై వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య అండర్-19 టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ టెస్టులో భారత ఆటగాడు వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున అత్యంత వేగవంతమైన యూత్ టెస్టు సెంచరీని సూర్యవంశీ నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 58 బంతుల్లో సెంచరీ బాదాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అగ్ర స్థానంలో ఉన్నాడు. అలీ 2005లో 56 బంతుల్లో వేగవంతమైన సెంచరీ చేశాడు.…