Supreme Court: సుప్రీంకోర్టులో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌కు ఊరట లభించింది. గుజరాత్ వడోదర రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట కేసును కొట్టివేయాలంటూ గతంలో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తాజాగా సుప్రీంకోర్టు సమర్థించింది. ‘రాయిస్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా షారూఖ్ తన చిత్రబృందంతో కలిసి 2017లో ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆయనను చూసేందుకు వడోదర రైల్వే స్టేషన్‌కు పోటెత్తారు. షారూఖ్ వారిపై టీషర్టులు, స్మైలీ బాల్స్ విసిరారు. వీటిని చేజిక్కించుకునే ప్రయత్నంలో…