ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. రాజమండ్రి – కాకినాడ ఏడీబీ రోడ్డుపై వడిశలేరు దగ్గర చోటు చేసుకున్న ప్రమాదంలో ఐదుగురు చనిపోయారని తెలిసి చింతిస్తున్నాను.. ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమైంది.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరులో రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పోటీలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జి.ఎస్.ఎల్ సంస్థల అధినేత డాక్టర్ గన్ని భాస్కర రావు ఆధ్వర్యంలో ఈ ఎడ్ల బండి పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి ఔత్సాహికులు భారీగా పాల్గొన్నారు.