ప్రస్తుతం కరోనాకు అనేక వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. గత రెండేళ్లుగా కరోనాతో ప్రపంచం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయితే, కరోనా మహమ్మారి ప్రారంభమైన ఆరేడు నెలల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతటి వేగంగా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఇదే మొదటిసారి. సాధారణంగా ఒక మహమ్మారికి వ్యాక్సిన్ తీసుకురావాలి అంతే ఏళ్ల తరబడి సమయం పడుతుంది. అన్ని రకాల ట్రయల్స్ పూర్తి చేయడానికి అధిక సమయం తీసుకుంటుంది. అయితే, అడ్వాన్డ్స్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి…
భారత్‌లో టీకా కార్యక్రమం వేగంగా సాగుతున్నది. ఇప్పటికే 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ జరిగింది. త్వరలోనే దేశంలో అర్హులైన అందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది భారత ప్రభుత్వం. అయితే, చిన్నారులకు సంబంధించి వ్యాక్సినేషన్ కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నది. కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ను తయారు చేసిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా వ్యాక్సినేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో మరింత వేగంగా డోసుల కార్యక్రమం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం…
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 16 వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. మొదట నిదానంగా సాగిన వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆ తరువాత దశల వారీగా పెంచుకుంటూ వెళ్లారు. కాగా నేటితో దేశంలో వందకోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. ప్రపంచంలోనే అత్యధిక డోసులు వేసిన దేశంగా భారత్ నిలిచింది. దేశంలోని 9 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో అర్హులైన అందరికీ మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తయినట్టు…
సాధారణంగా ఎన్నికలు జరిగే సమయంలో ఆయా ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తుంటారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా చెక్ చేస్తుంటారు. అయితే, ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కోసం ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని చెక్ చెస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి రాజాపురం తదితర ప్రాంతాల్లో వందశాతం వ్యాక్సినేషన్‌ను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రాపురం గ్రామంలోకి ప్రవేశించే శివారు ప్రాంతంలో ప్రత్యేకంగా చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఆ మార్గం గుండా వచ్చి వెళ్లే…
కరోనా మహమ్మారికి ప్రపంచ వ్యాప్తంగా 49 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. శాస్త్రవేత్తల నిరంతర శ్రమ కారణంగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. మహమ్మారులకు వ్యాక్సన్‌ను తయారు చేయాలి అంటే కనీసం ఐదారేళ్ల సమయం పడుతుంది. కానీ, కరోనా నుంచి కోలుకోవాలి అంటే వ్యాక్సిన్ తప్పనిసరి కావడంతో ప్రపంచం మొత్తం వ్యాక్సిన్‌పైనే దృష్టి సారించింది. ఆరునెలల కాలంలోనే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతున్నది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత…
కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే టీకాలు తీసుకొవడం ఒక్కటే మార్గం కావడంతో వేగంగా టీకాలు అమలు చేస్తున్నారు. టీకాలు తీసుకున్నాక శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. ఈ యాంటీబాడీలు కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. టీకాలు తీసుకున్నాక చాలా మందికి కరోనా సోకుతున్నది. అలాంటి కేసులను బ్రేక్‌త్రూ కేసులుగా పేర్కొంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కేసులు అధికంగా నమోదవుతుండటంతో అసలు వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అన్నది సందేహంగా మారింది. 16 రకాల వేరియంట్లపై వ్యాక్సిన్ సమర్థవంతంగా…
ఇప్పటి వరకు 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే దేశంలో టీకాలు అందిస్తూ వస్తున్నారు. కాగా, చిన్నారులకు సంబంధించి టీకాలపై భారత్ బయోటెక్ సంస్థ ట్రయల్స్‌ను నిర్వహించింది. కోవాగ్జిన్ టీకాల ట్రయల్స్ పూర్తికావడంతో డేటాను ఇప్పటికే కేంద్రం ఆరోగ్య శాఖకు అందజేసింది. కాగా కేంద్రం ఈ వ్యాక్సిన్‌కు అనుమతులు మంజూరు చేసింది. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ ప్యానల్ అనుమతులు ఇవ్వడంతో మరికొన్ని రోజుల్లోనే విపణిలోకి వచ్చే అవకాశం ఉన్నది. డ్రగ్స్ రెగ్యులేటరీ అనుమతి ఇవ్వాల్సి ఉన్నది. డ్రగ్స్ రెగ్యులేటరీ…
ప్రపంచంలో తొలి డిఎన్ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్నది. గుజరాత్ కేంద్రంగా జైడస్ క్యాడిలా ఫార్మా సంస్థ ఈ వ్యాక్సిన్‌ను రూపొందించింది. ఇప్పటికే డీసీజీఐ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయడంతో జైడస్ క్యాడిలా జైకొవ్ డి వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్నది. ఈనెల 20 వ తేదీ నుంచి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్నది. మూడు డోసుల వ్యాక్సిన్ కావడం విశేషం. అయితే, ఈ వ్యాక్సిన్‌కు సిరంజితో…
కరోనా నుంచి బయటపడాలి అంటే తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం కావడంతో వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నారు. ప్రపంచం మొత్తం కరోనాను ఎదుర్కొంటున్న సమయంలో కరోనాను పూర్తిగా దేశం నుంచి తరిమికొట్టి జీరో కరోనా దేశంగా గుర్తింపు పొందింది న్యూజిలాండ్. అయితే, ఇటీవలే అక్లాండ్‌లో డెల్టా కేసు ఒకటి బయటపడటంతో వెంటనే దేశంలో మూడు రోజులపాటు లాక్‌డౌన్ విధించారు. కాగా, ఇప్పుడు ఇదే విధమైన మరో కఠిన నిర్ణయం తీసుకున్నది న్యూజిలాండ్…
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసే క్రమంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వ్యాక్సినేషన్ కోసం వినియోగించే సిరంజీల ఎగుమతులపై మూడు నెలల పాటు పరిమితులు విధించింది. మూడు రకాల సిరంజీల ఎగుమతులపై పరిమితులు విధించింది కేంద్రం. దేశంలోని అర్హులైన అందరికి వ్యాక్సిన్ అందించే క్రమంలో సిరంజీల స్టాకును పెంచుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. తక్కువ సమయంలో ఎక్కువ వ్యాక్సిన్‌లు అందించాలనే లక్ష్యంలో భాగంగానే…