దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతున్నది. మెగా క్యాంపులు నిర్వహిస్తూ వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఇక కరూర్ జిల్లాలో వ్యాక్సిన్‌పై వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ ఎక్కవ మంది వ్యాక్సిన్ వేయించుకునేలా అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వారం వారం మెగా వ్యాక్సినేషన్ క్యాంపును నిర్వహిస్తున్న ప్రభుత్వం, రాబోయే ఆదివారం రోజున కూడా మెగా క్యాంపును నిర్వహిస్తోంది. వాలంటీర్లు ఎంత మందిని వ్యాక్సిన్ తీసుకోవాడానికి తీసుకొస్తే వారికి ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు అందించనున్నారు. అదేవిధంగా వ్యాక్సిన్ తీసుకున్నవారి…
మలేరియా… ప్రతి ఏడాది ఈ వ్యాధి కారణంగా లక్షలాది మంది చిన్నారులు మృతి చెందుతున్నారు. ఈ మలేరియా జ్వరానికి ఇప్పటి వరకు పిల్లలకు సంబంధించి సరైన వ్యాక్సిన్ అందుబాటులోకి లేకపోవడంతో ఇలా మరణాలు సంభవిస్తున్నాయి. కాగా, తాజాగా, ప్రపంచ ఆరోగ్యసంస్థ పిల్లల కోసం మలేరియా వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డబ్ల్యూటీఎస్ ఆర్టీఎస్ పేరుతో తయారు చేసిన వ్యాక్సిన్‌ను ఆమోదించింది. ఈ వ్యాక్సిన్‌ను 5 నెలలు పైబడిన పిల్లలకు వ్యాక్సిన్ అందించ వచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొన్నది.…
భారత్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇప్పటి వరకు అనుమతులు రాలేదు. అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చే అంశంపై వచ్చే వారం ప్రపంచ ఆరోగ్యసంస్థ తుది నిర్ణయం తీసుకోనున్నది. దీనిపై ప్రపంచ ఆరోగ్యసంస్థ నిపుపులు వచ్చేవారం సమావేశం కాబోతున్నారు. టీకాకు సంబంధించిన పూర్తి డేటాను ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థ అందజేసింది. దీనితో పాటుగా సెప్టెంబర్ 27 వ తేదీన అదనపు డేడాను కూడా భారత్ బయోటెక్ ప్రపంచ ఆరోగ్యకు అందజేసింది. దేశంలో ఇప్పటికే కోవాగ్జిన్…
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా అమలు చేస్తుండటంతో పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. వందశాతం వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీబాడీలు ఏడాది వరకు ఉంటాయని, బూస్టర్ డోసుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ తెలిపారు. దేశంలో అనేక వ్యాక్సిన్లు ప్రస్తుతం అత్యవసర వినియోగానికి అందుబాటులో ఉన్నాయని తెలిపారు. క్యాడిలా ఫార్మా తయారు చేసిన జైకోవ్ డి మూడో డోసుల వ్యాక్సిన్ త్వరలోనే మార్కెట్‌లోకి…
ప్రధాని మోడీ ఈరోజు అమెరికా బయలుదేరి వెళ్లారు. ఈనెల 23 న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తోనూ, ఆ తరువాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తోనూ ప్రధాని సమావేశం కానున్నారు. ఇతర దేశాలకు వెళ్ళాలి అంటే తప్పనిసరిగా వాక్సిన్ తీసుకొని ఉండాలి. అందులోనూ ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు పొందిన ఏడు రకాల వ్యాక్సిన్లలో ఏదో ఒకటి తీసుకొని ఉండాలి. ఇండియాలో సొంతంగా అభివృద్ధి చేసిన కోవాక్సీన్ ను ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇప్పటి వరకు గుర్తించలేదు. ఇండియాలో తయారైన ఈ వ్యాక్సిన్ ను ప్రధానితో పాటుగా అనేక…
అమెరికా వెళ్లేవారికి అక్కడి అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికీ అమెరికాలోకి అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన వ్యాక్సిన్లు తీసుకున్న వారికీ మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు మొత్తం ఏడు వ్యాక్సిన్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఇందులో మోడెర్నా, ఫైజర్ ఎన్ బయోటెక్, జాన్సన్ అండ్ జాన్సన్, ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనకా, కొవిషీల్డ్ టీకాలు తీసుకున్నవారికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్టు అమెరికా సీడీసీ తెలియజేసింది. నవంబర్ నుంచి నిబంధనలకు లోబడి టీకాలు…
కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. కోరలు చాస్తూనే ఉన్నది. అమెరికాతో పాటుగా అటు ఆస్ట్రేలియాలో కూడా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెద్ద సంఖ్యలో పెరిగిపోతుండటంతో వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేసింది ప్రభుత్వం. విక్టోరియా, న్యూసౌత్‌వేల్స్‌లో కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేశారు. నిర్మాణ కార్మికులు కనీసం ఒక్క డోసు తప్పనిసరిగా తీసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకున్న వారినే నిర్మాణ పనులకు హాజరుకావాలని ఆదేశించింది. దీనిని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించారు. వందలాది మంది నిర్మాణకార్మికులు మెల్‌బోర్న్ రోడ్లపైకి…
కరోనాతో ప్రపంచం అతలాకుతలం అవుతున్న సమయంలో రెండు వ్యాక్సిన్లను తయారు చేసిన భారత్.. అగ్రదేశాలు ఎవరూ చేయని విధంగా.. ఉదారంగా ఇతర దేశాలకు సాయం చేసింది. కోట్లాది డోసులు ఉచితంగా చిన్న దేశాలకు పంపిణీ చేసి మానవత్వం చాటుకుంది. అయితే, కోవిడ్ థర్డ్‌వేవ్ ఎఫెక్ట్, టీకా కొరత, విపక్షాల విమర్శలతో గత కొన్ని నెలలుగా విదేశాలకు వ్యాక్సిన్ సరఫరా నిలిపి వేసిన ఇండియా… మరోసారి కరోనా టీకాలను ప్రపంచ దేశాలకు విరాళంగా ఇచ్చేందుకు సిద్ధమైంది. కొవిడ్ వ్యాక్సిన్లను…
కరోనా సమయంలో వ్యాక్సినేషన్‌ను ప్రభుత్వం వేగవంతం చేసింది. కరోనా నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారం కావడంతో ప్రజలు ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఉత్తర ప్రదేశ్‌లోని మేరఠ్‌కు చెందిన రామ్‌పాల్ సింగ్ అనే వ్యక్తి రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నాడు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాక సదరు వ్యక్తి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. కాగా, అందులో ఐదు డోసులు తీసుకున్నట్టుగా ఉండటంతో షాక్ అయ్యాడు. మార్చి 16న…
కేరళలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రతిరోజూ 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సిన్‌ను వేగవంతం చేశారు. వేగంగా వ్యాక్సిన్ అందిస్తున్నప్పటికీ కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, 84 ఏళ్ల వృద్ధురాలికి అరగంట వ్యవధిలో కోవీషీల్డ్ రెండు డోసులు ఇవ్వడంతో సంచలనంగా మారింది. ఎర్నాకులం జిల్లాలోని అలువా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ ఘటన జరిగింది. 84 ఏళ్ల తుండమ్మ అనే మహిళ తన…