Gudivada Amarnath: అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. వికేంద్రీకరణపై విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అమరావతి రైతులు చేసేది పాదయాత్ర కాదని.. దండయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. వారిని తరిమికొట్టేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. తక్షణమే అమరావతి రైతులు తమ పాదయాత్రను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కూడా తమ ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉందన్నారు.…