ఎన్నికలంటే ఓటర్లను ఆకట్టుకోవడం.. వారికి హామీల మీద హామీల గుప్పిస్తూ ఓట్లు వేయించుకోవడం. దేశంలో ఇప్పుడు ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఉత్తరాఖండ్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వివిధ పార్టీల ప్రచారాలు ఊపందుకున్నాయి. ప్రజలను ఆకర్షించడానికి నాయకులు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్ల పక్కన వుండే వివిధ స్ట్రీట్ ఫుడ్ షాపుల్లో నేతలు హడావిడి చేస్తున్నారు. పానీపురీ, కొబ్బరి బొండాలు, టిఫిన్ సెంటర్లు… ఇలా వేటినీ వదలడం లేదు నేతలు. సామాన్యులతో మమేకమవుతూ వివిధ కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నారు.…