ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ మినహా నాలుగు రాష్ట్రాల్లో సత్తా చాటింది బీజేపీ.. అయితే, ఉత్తరాఖండ్‌లో మాత్రం విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది.. పార్టీకి మెజార్టీ సీట్లు వచ్చినా.. సీఎంగా ఉన్న పుష్కర్ సింగ్ ధామి మాత్రం ఓటమిపాలయ్యారు. దీంతో.. కొత్త సీఎం ఎవరు? అనే దానిపై చర్చలు సాగుతున్నాయి.. ఈ నేపథ్యంలో.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా రీతూ ఖండూరిని ఎంపిక చేసే అవకాశం ఉందనే చర్చసాగుతోంది.. ఇదే జరిగితే, ఉత్తరాఖండ్ తొలి మహిళా ముఖ్యమంత్రి ఆమె కానున్నారు..…