దేశీయ విమానయాన రంగంలోకి మరో కొత్త సంస్థ ఎంట్రీ ఇవ్వబోతుంది. భారత్‌లో విమాన సర్వీసులు నడిపేందుకు శంఖ్ ఎయిర్‌కు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే విమానయాన సంస్థ గగనతలంలోకి వెళ్లేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుంచి కూడా అనుమతి పొందాల్సి ఉంది.