ఉత్తమ్ కుమార్‌రెడ్డి. ప్రస్తుతం నల్లగొండ ఎంపీ. గతంలో హుజూర్‌నగర్ ఎమ్మెల్యే. పీసీసీ మాజీ చీఫ్. ఎంపీగా కిక్కు ఇవ్వలేదో.. అసెంబ్లీనే ముద్దు అనుకుంటున్నారో కానీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే ఫోకస్ పెడుతున్నారు. హుజూర్‌నగర్‌ను విడిచిపెట్టేది లేదని.. ఎమ్మెల్యేగా బరిలో దిగుతానని ఇటీవలే ఓపెస్ స్టేట్‌మెంట్ ఇచ్చారు ఉత్తమ్. నల్లగొండ ఎంపీగా ఉండటంతో వచ్చే ఎన్నికల్లో ఉత్తమ్ ఏం చేస్తారు అనేదానిపై పార్టీ కేడర్‌లో ఇన్నాళ్లూ కొంత సస్పెన్స్ ఉండేది. ఆ ఉత్కంఠకు ఆయన తెరదించేశారు.…
టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం ఉత్తమ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఏడున్నర ఏళ్లుగా డైరెక్టుగా అలయెన్స్ లో ఉన్నారని, అందుకే టీఆర్‌ఎస్ కేంద్రం ప్రవేశపెడుతున్న ప్రతి బిల్లుకూ మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. అంతేకాకుండా బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు చీకటి ఒప్పందంతో పని చేస్తున్నాయని ఆయన విమర్శించారు. 120 ఏళ్ల సింగరేణి సంస్థకు ఎంతో ఘన…