H-1B Visa: డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇమ్మిగ్రేషన్, వలసలపై కఠిన వైఖరి అవలంభిస్తున్నాడు. H-1B వీసా హోల్డర్లపై అనేక ఆంక్షలు విధిస్తున్నాడు. ముఖ్యంగా, H-1B వీసా వీసాలపై ఆంక్షలు భారతీయుల అవకాశాలను దెబ్బతీస్తున్నాయి. ఎందుకంటే ఈ వీసాలపై 70 శాతం భారతీయులు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే, ఇప్పుడు అమెరికా వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్న క్రమంలో, కెనడా ఆహ్వానం పలుకుతోంది.